మెట్పల్లి టౌన్ మే 03 జనంసాక్షి :కార్మికుల దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి రూపాయల వేతనం పెంచినందుకు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రాణావేని సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కో ఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్,కౌన్సిలర్ ఒజ్జెల బుచ్చిరెడ్డి,పిప్పెర శేఖర్,సత్తార్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




