వరంగల్ ఈస్ట్, మే 03 జనం సాక్షి తెలంగాణ ‘పోపా ‘ రాష్ట్ర అధ్యక్షులుగా, ఇటీవల ఎన్నికైన న్యాయవాది శామంతుల శ్రీనివాస్ ను, మహాలక్ష్మి విహార సంఘము, శివనగర్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలి కుల అభివృద్ధికి, రాజకీయ ఆర్థిక, సామజిక రంగాలలో, ఎదుగుదలకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో సంఘ ప్రతినిధులు బుదారపు శ్రీనివాస్, సింగం అశోక్, కుడికాల మనోహర్, కండగట్ల గణేష్, వడ్డేపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.




