Monday, 2 November 2026

ఘనంగా బిఆర్ఎస్ యువనేత రామారావు జన్మదిన వేడుకలు

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఇనుగంటి రామారావు జన్మదిన వేడుకలను గురువారం ఆయన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రామారావు చేతుల మీదుగా బర్త్డే కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రామారావు తల్లిదండ్రులు, ఆదివరాహ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ఇనుగంటి ప్రేమలత జగన్నాధ రావు, సతీమణి హిమబిందు, వారి కుమార్తెలతో పాటు ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, ఆలయ కమిటీ డైరెక్టర్లు బొజ్జ నరసింహ చారి, దండే కనక రత్నం , కొలిపాక లక్ష్మి , భూ పెళ్లి జ్యోతి , పిడుగు అంజి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామారావు అభిమానులు పాల్గొన్నారు.