పెన్ పహాడ్, మే 30 (జనం సాక్షి) : మండల కేంద్రం లో మంగళవారం. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగకృష్ణ కార్మికులు ఎంతో పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు చట్టాలుగా క్రోడీకరించడం వలన కార్మికులు వీధున పడే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారుు, కేంద్రంలో అధికారం రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ భృతి కల్పిస్తానని ప్రజలను మోసం చేశాడని మేకిల్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ నిరుద్యోగ సమస్య పెంచారని అన్నారు, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలన్నీ బడా పెట్టుబరుదారులకు తాకట్టు పెట్టిందని ఆయన అన్నారు మోడీ అధికారంలో వచ్చాక సామాన్య ప్రజల పైన .పెట్రోల్. డీజిల్ .గ్యాస్ విపరీతంగా పెంచి అనేక భారాలు మోపుతా ఉంది కార్మికులు కన్నెర్ర చేస్తే బిజెపి ప్రభుత్వం గద్ద దింపడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు .ఈ కార్యక్రమంలో అమాలి సంఘం అధ్యక్షులు. కోట సైదులు. ఒగ్గు నాగయ్య. జానయ్య. శంకరు. కత్తి ఉపేందర్ .బక్కయ్య .ఎస్కె సైదులు. రాములు. తదితరులు పాల్గొన్నారు…
కార్మికుల చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం రణపంగకృష్ణ




