జనంసాక్షి, మంథని : దేశానికి వెలుగులు నింపే సింగరేణి సంస్థ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సేవకు గుర్తింపుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ శ్రమశక్తి అవార్డులు అందజేశారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని రాజగృహాలో శ్రమశక్తి అవార్డు పొందిన ఆర్ జి 3 డివిజన్ డిబిజికేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, రెసిడెన్షియల్ కమిటీ మెంబర్ సభ్యుడు ఎల్లంకి రామారావు లను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మంగళవారం అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేడేను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో కార్మికుల సేవకు గుర్తింపు ఇచ్చి సత్కారం చేయడం గొప్ప విషయమని, ఈసారి సింగరేణి సంస్థలో అవార్డుల పంట పండినట్లుగా బావిస్తున్నట్లు ఆయన అన్నారు. కార్మికుల సేవలను గుర్తించి అవార్డులు రావాడాన్ని ప్రతి కార్మికుడు స్పూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ఇదే స్పూర్తితో అవార్డులు పొందిన కార్మికులు మరింత పనిచేయాలని, అలాగే ప్రతి కార్మికుడు అవార్డు పొందాలనే ఆకాంక్షను పెంచుకుని ముందుకు సాగాలన్నారు. శ్రమశక్తి అవార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ నాయకులకు స్పూర్తిదాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్మికులు శ్రమశక్తి అవార్డు పొందేలా కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.




