Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లా  వైద్య ఉద్యోగులు.

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 2. (జనంసాక్షి).కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా వైద్య ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయము వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత ఈరవై సంవత్సరాల వెట్టి చాకిరి నుండి  విముక్తి చేసి మా కుటుంబాల్లో వెలుగు నింపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారికి, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామరావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఉద్యోగులు, సుదగోని మహేష్ గౌడ్, ఎస్.శ్రీనివాస్, ఎస్.వెంకటేశ్వరావ్, కర్ణే రవీందర్, కలికోట నరేందర్, రమేష్, ఏం. బాబు, రమేష్, ల్యాబ్ టెక్నీషియన్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.