కార్మిక అక్రమ తొలగింపు వెంటనే అపివేయాలి..జీవో 60 ప్రకారం కార్మికుల వేతనం చెల్లించాలి
దామెర జులై 12 జనంసాక్షి : బుధవారం రోజున గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలకు ఏఐటిసి సిపిఐ సంపూర్ణ మద్దతు కార్మిక సమస్యలు వెంటనే ప్రభుత్వము పరిష్కరించాలి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ఏఐటీ సి జిల్లా అధ్యక్షుడు జక్కురాజ్ గౌడ్ అని ప్రకటన లో తెలిపారు,గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బుధవారం దామెర మండల కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె ఏడు రోజులుగా కార్మికులు సమస్యల పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్చిన్నం చేయడం కోసం కార్మికులను తొలగించి కొత్త వారిని పెట్టుకుంటామని పంచాయితీ అధికారులు కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, ఆ పద్ధతి వెంటనే మానుకోవాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు జక్కురాజ్ గౌడ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అన్నారు, 9 సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడి చేస్తుందన్నారు.