రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం : టి పి సి సి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి : రైతు బంధు పథకం పేద ప్రజల పేరు చెప్పి ధనవంతులకు ఖజానా ప్రభుత్వం అంద జేయడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని టి పి సి సి రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అలియాబాద్ కరెంటు సబ్
స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మ ను దహనం చేసిన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు అశోక్, వెంకటేష్, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు