Wednesday, 4 November 2026

కార్మిక రైతుల ఆందోళన

విజయనగరం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): కార్మిక రైతుల ఆధ్వర్యంలో విజయనగరం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గురువారం జైల్‌ భరో నిర్వహించారు. శాంతియుతంగా ప్రదర్శనగా వచ్చిన కార్మికులు, రైతులను, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూఢడ్ల కృష్ణమూర్తిని, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంబాబును, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని 1వ పట్టణ పోలీస్‌ స్టేషనుకు తరలించారు.