కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
నందిపేట్ మండల ఖుదావన్పూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పెరిక నాగన్న మనవరాలు రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 10 లక్షల రూపాయలు బిల్లు చెల్లించే పరిస్థితి లేనందున. ఆర్థిక ఇబ్బందిగా ఉన్నందున, ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి తెలియజేయగానే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా స్పందించి వారికి హామీ ఇచ్చి తాను అన్ని రకాల చేయూత నిచ్చి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆర్థిక సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది .అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చిన కార్యకర్త పట్ల తన ఉదార భవాని చాటిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి తాము ఎప్పటికీ మర్చిపోమని నాగన్న కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు దుబాయ్ శీను , నడుకుడ పెద్దన్న పాల్గొనడం జరిగింది