స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత

అనారోగ్యంతో ఏడు సంవత్సరాల క్రితం మృతి చెందిన తమ స్నేహితుని కుటుంబానికి 1993-94 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని బహదూర్ గూడెం గ్రామానికి చెందిన సుగ్రీవుడు గత ఏడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుగ్రీవుడు మృతితో ఆ కుటుంబం కడు పేదరికంతో జీవనం సాగిస్తున్నారని తెలుసుకొని 1993-94 పదవ తరగతి మిత్రులు కలిసి 10,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి శనివారం రోజు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి,రామచందర్ యాదవ్, రామ్ చందర్ జీ,వెంకటేష్,శేఖర్, షఫీయాద్ధిన్ తదితరులు పాల్గొన్నారు