బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం 21వ వార్డుకు చెందిన ఎనగందుల చరణ్ అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం చరణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయాన్ని అందించారు. ఇకముందు వైద్య చికిత్సలకు అయ్యే మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆరోగ్యం జాగ్రత్త అని సలహా ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ గోసిక రమేష్, నాయకులు శ్రావణ్, రమేష్, సురేష్, రాజేష్ ఉన్నారు.
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే.




