Thursday, 5 November 2026

తెలంగాణ రన్ విజయవంతం చేయండి. – బెల్లంపల్లి ఏసీపీ సదయ్య.

బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి )
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన తెలంగాణ 2కె రన్ విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య పిలుపునిచ్చారు. రేపు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం అయ్యే 2కె రన్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. సింగరేణి గ్రౌండ్ 1 లో 6 గంటలకు ప్రారంభం అయ్యే 2కె రన్ ఏఎంసి గ్రౌండ్ 2 ముగుస్తుందన్నారు. ఈకార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్, మంచిర్యాల డీసీపీ, సింగరేణి జీఎం హాజరుకానున్నారని వివరించారు. 2కె రన్ లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, అందరూ పెద్దమొత్తంలో 2కె రన్లో పాల్గొని విజయవంతం చేయాలని ఏసీపీ కోరారు.