Thursday, 5 November 2026

సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

వరంగల్ బ్యూరో, జూన్ 10 (జనం సాక్షి) నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ సబ్  ఇన్స్పెక్టర్ కంచి విద్యాసాగర్ అన్నారు. ఇన్నోవేటివ్ డిప్లొమా ఇంజనీర్  కోచింగ్ సెంటర్, రాంనగర్,హన్మకొండ లో దాదాపుగా 150మంది విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు  ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు  ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్ధులు ఎవరి నుండైన ఇబ్బందులకు గురైనప్పుడు, ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే  ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచారం ఇవ్వాలని,మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సి. పి.  వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్. ఐ. వాట్సాప్ నెంబర్ 8712685270 కి పిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు,లెక్చరర్ లతో  పంచుకోవాలని, అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఇన్నోవేటివ్ డిప్లొమా ఇంజనీర్  కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రెడ్డి, సాహితి రెడ్డి  మాట్లాడుతూ నేటి కాలంలో  అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎలాంటి విషయాలను, ఫోన్ నంబర్లను, ఫోటోలను షేర్ చేసుకోవద్దని, సోషల్ మీడియాలో పరిచయమైన వారితో ఎలాంటి వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవద్దని, ప్రేమ పేరుతో వాళ్లు చెప్పే మాటలను నమ్మి తల్లిదండ్రులకు తెలుపకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సబ్ -ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ కంచి. విద్యాసాగర్ మరియు హెడ్ కాన్స్టేబుల్ బిచ్య నాయక్,ఉమెన్ కానిస్టేబుల్ లక్ష్మి మరియు కోచింగ్ సెంటర్ లెక్చరర్స్ నేహా, బి. కళ్యాణి  తదితరులు హాజరైనారు.