Thursday, 5 November 2026

నెన్నెల మండలంలో కంటి వెలుగు షెడ్యూల్.

ఫొటో : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
బెల్లంపల్లి, జనవరి 17, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలో కంటి వెలుగు ప్రణాళిక తయారు చేసినట్లు మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ తెలిపారు. కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ భవాని, అప్టోమెట్రిస్ట్ గా రాజు విధులు నిర్వహిస్తారని వివరించారు. మండలంలో ఆవడం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం లాంచనంగా ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 18, 19, 20, 23, 25, 25 తేదీలలో ఆవడం గ్రామ పంచాయతీలో, 27, 30, 31, ఫిబ్రవరి 1 వరకు గంగారాం గ్రామపంచాయతీలో, ఫిబ్రవరి 2, 3, 6 తేదీలలో కొత్తురు గ్రామ పంచాయతీలో, ఫిబ్రవరి 7, 8, 9, 10 తేదీలలో చిన్న వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో, ఫిబ్రవరి 13, 14, 15, 16, 17, 20 తేదీలలో చిత్తపూర్ గ్రామ పంచాయతీలో, ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో గుండ్ల సోమారం గ్రామ పంచాయతీలో, ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1, 2, తేదీలలో నర్వాయి పేట గ్రామ పంచాయతీలో, మార్చ్ 3, 6, 8, 9 తేదీలలో మెట్ పల్లి గ్రామ పంచాయతీలో, మార్చ్ 10, 13, 14, 15 తేదీలలో జెండా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో, మార్చ్ 16, 17, 20 తేదీలలో జోగా పూర్ గ్రామ పంచాయతీలో, మార్చ్ 21, 23, 24, 27, 28, 29 తేదీలలో గొల్లపల్లి గ్రామ పంచాయతీలో, మార్చ్ 31, ఏప్రిల్ 3, 4, 6, 10, 11, 12, 13, 17, 18, 19 తేదీలలో మైలారం గ్రామ పంచాయతీలో, ఏప్రిల్ 20, 21, 24 తేదీలలో గన్ పూర్ గ్రామ పంచాయతీలో, ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీలలో నందుల పల్లి గ్రామ పంచాయతీలో, మే 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12, 15, 16, 17, 18 తేదీలలో నెన్నెల గ్రామ పంచాయతీలో, మే 19, 22, 23, 24, 25 తేదీలలో జంగాల్ పేట గ్రామ పంచాయతీలో, మే 26, 29, 30, 31 తేదీలలో మన్నెగూడెం గ్రామ పంచాయతీలో, మార్చ్ 29, 31, ఏప్రిల్ 3, 4, 6 తేదీలలో కోణంపేట గ్రామ పంచాయతీలో, ఏప్రిల్ 10, 11, 12, 13, 17 తేదీలలో కుష్ణ పల్లి గ్రామ పంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించ బడుతుందని తెలిపారు. ఈకార్యక్రమాన్ని మండలంలోని ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థలు, అన్ని శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.