Wednesday, 4 November 2026

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ..!

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలోని రాజేందర్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సుంకరి స్వామి ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్వయంగా వారి ఇంటికి వెళ్లి 2.00.000 రూపాయల చెక్కు ను వారి తండ్రి సుంకరి లింగయ్య కు కమాన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి రూ, 2.00.000 /- ( రెండు లక్షల ) చెక్కు మంజూరుకు కృషి చేసిన మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్రికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, కమాన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఏ.ఎం.సి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ. ఇంతియాజ్, బీఆర్ఎస్ పార్టీ గుండారం గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, దామెర సంపత్, ఆకుల గట్టయ్య, గాదె సది, గడప కృష్ణమూర్తి, దండే కనకరత్నం, పిడుగు అంజి, మేడగొని విజయ్ గౌడ్, బొల్లపల్లి శంకర్ గౌడ్, సింగం శ్రీనివాస్, జంగపల్లి లక్ష్మణ్, గరిగంటి బాలయ్య, మెరుగు కుమార్, పిట్టల స్వామి, జంగపల్లి రవి, మల్యాల భాస్కర్, బొట్టు రవి, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.