Wednesday, 4 November 2026

మళ్లీ సర్వే చేసి పోడు పట్టా ఇప్పించండి ఓ రైతు ఆవేదన

రామారెడ్డి జూలై 7 ( జనంసాక్షి ) :

మళ్లీ సర్వే చేసి పోడు పట్టా ఇప్పించండి ఓ రైతు ఆవేదన
ఖేతావాత్ రాజ్య విలేకరులతో మాట్లాడుతూ, రామారెడ్డి మండలం కన్నాపూర్ తండా గ్రామానికి చెందిన వ్యక్తికి తాను చేసుకుంటున్నా సాగు భూమి ( 139 ) సర్వే నంబర్ లో కన్నాపూర్ గ్రామ శివారులో కలిగి ఉన్న భూమి పోడు పట్టా రాలేదని ఆవేదన చెందాడు. అన్ని రకాల సర్వేలు పూర్తి చేశారు అధికారుల తప్పిదం వల్ల తనకు పట్టా పాస్ పుస్తకం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, కలెక్టర్, తాసిల్దార్, తన సాగు చసుకుంటున్న భూమి ని గ్రామస్తుల సహకారంతో పరిశీలించి తనకు రావలసిన పట్టా పోడు భూమిని పాస్ పుస్తకం అందించాలని వేడుకున్నారు.