Saturday, 7 November 2026

కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నవంబర్ 26 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని మాజీ టీపీసీసీ అధ్యక్షులు నలగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని 14వ వార్డులో మరణించిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోలపూడి కాంతయ్య సతీమణి కోల్లపూడి లలితమ్మ అకాల మరణం చెందింది వారి కుటుంబాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించి పార్టీ జెండా కప్పడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, పిసిసి సభ్యులు అల్లం ప్రభాకర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు కోల్లపూడి యోహాన్, లచ్చుమల్ల నాగేశ్వరరావు, కోల్లపూడి డేవిడ్, పెద్దారపు రామకృష్ణ, దుగ్గి సైదులు, కంకణాల పుల్లయ్య, బెంజిమెన్, ఎడవల్లి వీరబాబు, గొట్టముక్కల రాములు, శివనేని, అబ్రహం, లచ్చుమల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు