వివిధ సీడ్ కంపెనీ డీలర్లకు అవగాహన
వీణవంక నవంబర్ 26 (జనం సాక్షి) వీణవంక మండలానికి చెందిన వివిధ సీడ్ కంపెనీల డీలర్లతో స్థానిక లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ లో
వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట రూలర్ సీఐ సురేష్ వ్యవసాయ శాఖ అధికారి ఏవో గణేష్ హాజరై మాట్లాడుతూ… వ్యవసాయ శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. సీడ్ కంపెనీ డీలర్లు గుర్తింపు పొందిన సీడ్స్ కంపెనిల నుండి తీసుకువచ్చిన వరి మొక్కజొన్న నాణ్యత కలిగిన విత్తనాలను మాత్రమే రైతులకు ఇవ్వాలి. సీడ్ కంపెనీ యాజమాన్యులు డీలర్లు రైతుల నుండి ఎలా అగ్రిమెంట్ తీసుకుంటారో అలాగే రైతులకు కూడా సంబంధిత కంపెనీ నుండి డీలర్లు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా రైతులను ఎవరైనా మోసం చేసిన వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని సూచించారు. రైతులను ఆయా సీడ్ కంపెనీల డీలర్లు ఎవరు మోసం చేయవద్దని చెప్పారు. ఆరుగాల పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు పంట పండించడం జరుగుతుందన్నారు. కానీ కొంతమంది గుర్తింపు లేని సీడ్ కంపెనీల పేర్లు చెప్పుకొని దళారులు రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి తర్వాత డబ్బుల విషయంలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. మనలో చాలామంది రైతులు మోసపోవడం జరుగుతుందని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. డబ్బులు ఇవ్వని వారిని సీడ్ డీలర్లను యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులు గుర్తింపు పొందిన సీడ్ కంపెనీల ఇచ్చిన విత్తనాలు మాత్రమే పెట్టాలి లేని యెడల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రైతులను ఎవరు మోసం చేసిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి, ఏఓ గణేష్ ,పోలీస్ సిబ్బంది రాజబాబు , పాషా,రమేష్ ,సీడ్ కంపెనీల డీలర్లు నల్ల తిరుపతిరెడ్డి, దేవేందర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, కొమురయ్య, మండలం అన్ని గ్రామాల చెందిన డీలర్లు పాల్గొన్నారు.
వివిధ సీడ్ కంపెనీ డీలర్లకు అవగాహన




