దివ్యజ్యోతి పాఠశాల కరాటే విద్యార్థులకు ప్రశంసలు – విద్యార్థులను అభినందించిన సర్పంచ్ బాలమణి:శామీర్ పేట్, జనం సాక్షి :
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శామీర్పే గ్రామ సర్పంచ్ బాలమణి, పంచాయతీ కార్యద ర్శి మౌనికలు ప్రశంసించి అభినందనలు తెలిపారు. ఈ నెల 12న నగరంలోని అంబర్ పేట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటే పోటీల్లో శామీర్ పేట్ దివ్యజ్యోతి హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కరాటే మాస్టర్ బాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు 9 మంది ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా తిరిగి వచ్చారు. పోటీల్లో పాల్గొన్న అమరేష్ నాయక్, సాయిచరణ్, లోకేష్ లు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. సర్ఫరాజ్, సాయికిరణ్, నందివర్ధన్, అక్షర ద్వితీయ బహుమతి అందుకున్నారు. శ్రీనిధి, కౌశిక్ లు తృతీయ బహుమతులను అందుకున్నారు. వీరికి శామీర్పేట సర్పంచ్ బాలమణి చేతుల మీదుగా షీల్డ్ లు, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్ తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలమణి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు దేశానికి సారధులు, ప్రపంచ దేశా లకు దిక్సూచీలన్నారు. చిన్నతనంలోనే ఏదైనా సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తే అన్ని రంగాల్లో రాణిం చగలుగుతారని వివరించారు. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి చూసిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. అనంరతం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో సర్పంచ్ బాలమణి అధ్యక్షతన రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, దివ్యజ్యోతి పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, టీచర్లు సోని, గ్రేసీ తదితరులు పాల్గొన్నారు.
26 – ఎస్పీటీ -4: కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో సర్పంచ్ బాలమణి –
దివ్యజ్యోతి పాఠశాల కరాటే విద్యార్థులకు ప్రశంసలు – విద్యార్థులను అభినందించిన సర్పంచ్ బాలమణి:శామీర్




