వీర్నపల్లి, జులై 04 (జనంసాక్షి): మండలంలోని మద్ధిమల్ల గ్రామానికి చెందిన కోతి జయంత్ అనే బీజేపీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం ప్రమాద వశాత్తూ చనిపోయాడు. మంగళ వారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి శ్రీనివాస్ అతని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేశ్, మల్లేశం వినోద్, రమేష్, మహేష్, లఖ్పతి, తిరుపతి, బండారి మహేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన లగిశెట్టి




