Tuesday, 3 November 2026

ముత్యాలమ్మ గుడి అభి వృద్ధి కి రూ.25116 లు దాతలు విరాళం

పెనుబల్లి, జులై 4(జనం సాక్షి)పెనుబల్లి ముత్యాలమ్మ తల్లి గుడి అభివృద్ధికి దాతలు రూ.25116 లు అందచేసారు, గుడి ఆవరణంలో వంట షెడ్డు, భోజన శాల నిర్మాణం కొరకు స్థానికులు తోటకూర వెంకటేశ్వర్లు పద్మావతి దంపతుల కుమారులు తోటకూర వెంకటరామారావు రేణుకా, తోటకూర తిరుపతిస్వామి కృష్ణవేణి దంపతులు రూ. 25116 లు విరాళంగా అందజేశారు, మరొ దాతలుజిల్లెల్ల రాములు సరస్వతి ల దంపతుల కుమారులు జిల్లెల్ల శ్రీను, జిల్లెల్ల పాండురంగారావు దంపతులు గర్భ గుడిలో టైల్స్ విరాళంగా అందజేశారు, పెనుబల్లిఈడా నాగేశ్వరరావు దంపతులు ఆలయానికి మైక్ సెట్ విరాళంగా అందజేశారు, రెండోవ మైక్ సెట్ అందించిన దాతలు శ్రీరంగం శ్రీనివాస చార్యుల దంపతులు, ఈ సందర్భం ఆలయ కమిటీ తరఫున వంగా కృష్ణ గౌడ్, వంగ చెన్నారావు గౌడ్, మిద్దె స్వామి, వేముల బాబురావులు విరాళాలు అందజేసిన దాతలకు ప్రత్యేకఅభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.