జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ యువ కార్యకర్త అవునూరి విజయ్ మృతి చెందడం పట్ల బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కంటతడి పెట్టారు. బీఆర్‌ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తున్న విజయ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జెడ్పీచైర్మన్ పుట్ట మధూకర్ హుటాహుటీన ముస్త్యాలకు చేరుకుని విజయ్ పార్థివ దేహాన్ని సందర్శించి కన్నీరు పెట్టుకున్నారు. విజయ్ మృతి పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. విజయ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని విజయ్ కుటుంబసభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు.
కార్యకర్త మృతి పట్ల జెడ్పీ చైర్మన్ కంటతడి




