హైదరాబాద్: సమరదీక్షలో పాల్గోనాడానికి బయల్దేరిన రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంతో సహా టీఎన్‌జీవో నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలోనే కోదండరాం ఐకాస నేతలతో కలిసి దీక్షకు దిగారు. తెలంగాణ వాదులను ఎక్కడ అడ్డుకుంటే అక్కడే దీక్షలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. మరో వైపు ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.




