Tuesday, 3 November 2026

సమరదీక్షకు సంపూర్ణ మద్దతు : ఎర్రబెల్లి

వరంగల్‌ : రాజకీయ ఐకాస తల పెట్టిన సమరదీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెదేపా తెలంగాణ ఫోరం ప్రకటించింది. రాజమండ్రి సభకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇందిరాపార్కు సమరదీక్షకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి ప్రశ్నించారు. అరెస్టు చేసిన నేతలతో పాటు, ఓయూ, కేయూ విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసోందని మండిపడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం నడిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రామాలాడుతున్నారని ధ్వజమోత్తారు. 28లోపు తెలంగాణపై ప్రకటన రాకపోతే తెదేపా తెలంగాణ ఫోరం కార్యాచరణ ప్రకటిస్తుందని ఎర్రబెల్లి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *