కాలయాపనలకు ఇక కాలం చెల్లింది
విభజన హావిూలపై కదలకుంటే బిజెపికే నష్టం
అమరావతి,ఆగస్ట్31(జనం సాక్షి): విభజన హావిూలపై కేంద్రం లేదా బిజెపి అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు అమలు చేస్తేనే తదుపరి ఎన్నికల్లో వారిని ప్రజలు వారిని గుర్తుంచుకుంటారు. విభజన కారణంగా అనేక సమస్యలు ఇప్పుడు ఎపిని, తెలంగాణను వెన్నాడుతున్నాయి. ఈ దశలో ప్రత్యేక¬దా హావిూని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉంది. దీనిపై తప్పించుకునే కారణాలను ఇక ప్రజలు నమ్మరని గుర్తుంచుకోవాలి. ప్రజల భావోద్వేగాలను సవిూక్షించి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ఏదో మంచి జరగనుందన్న సంకేతాలు వెలువరించడం ఒక ఎత్తయితే, వాటిని చేస్తామన్న సంకేతాలు ఇవ్వడం మరో ఎత్తు. ఏది చేస్తారో అనడానికి కొంత చొరవ అవసరం. ముసుగులో గుద్దులాట లేకుండా సూటిగా సాగాలి. ప్రత్యేక¬దాపై ప్రకటన వస్తుందని కసరత్తు చేస్తున్నామని, దీనిపై న్యాయ కోవిదుల సలహాలు తీసుకుంటున్నామని, ఆ తరువాత ప్రకటన వెలువడుతుందని ఇంతకాలం చెబుతూ వచ్చారు. ఇకముందు ఎన్నికల్లో బిజెపి ఏం చెబుతుందన్నది ముఖ్యంకానున్నది. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పలుబహిరంగ సభల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు.బిజెపిలకు ఓటేయాలని కోరినప్పుడు లేని అభ్యంతరాలు అధికారంలోకి వచ్చాక గుర్తు పెట్టుకోకపోవడం,నిర్లక్ష్యంగా ఉండడం సరికాదు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దా హావిూని నెరవేరుస్తామని ప్రజలకు హావిూ ఇచ్చారు. ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిందని, ఒక ప్రాంతాన్ని దిక్కులేకుండా చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆ లోపాన్ని సరిదిద్దుతామని నరేంద్ర మోడీ విస్పష్టంగా ప్రకటించారు. అందుకే ఇప్పుడు టిడిపి నేతలు ఆంధ్రలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని, ఓపికను పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇంతకన్న గట్టిగా ఇంకా చెప్పాలని కేంద్రం కోరుకోవడం సరికాదు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలే గాకుండా దేశం యావత్తు నరేంద్రమోడీని గాఢంగా నమ్మారు. అందుకే ఆయన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చారు. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని తీర్పునిచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవడంలో బిజెపి పూర్తిగా విఫలం అయ్యింది. విభజన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అరుణ్‌జైట్లీ, మరో ముఖ్యనాయకుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక ¬దా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. విభజన బిల్లు రాజ్యసభ
ముందుకు వచ్చినపుడు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక ¬దాపై డిమాండ్ చేయడం అందుకు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంగీకరించడం తెలిసిందే. నిజానికి ప్రత్యేక ¬దా ఇవ్వాలంటే కొండ ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు రాష్ట్రంలో ఉండాలి. వాటినే ప్రాతిపదికన చూస్తే, అటు ఆంధ్రప్రదేశ్‌కు గానీ, ఇటు తెలంగాణకు గానీ ప్రత్యేక ¬దా దక్కే అవకాశం లేదు గాక లేదు. ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు ఇన్ని నిబంధనలు ఉంటాయనే విషయాన్ని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఏ రకంగా ఆదుకుంటారో చెప్పాలి. కేంద్రం ఇచ్చే సాయం ఏదో బిచ్చమేసినట్లుగా కాకుండా రాష్ట్రాల హక్కుగా ఉండాలి.