Wednesday, 4 November 2026

కాలు కోల్పోయిన బాధితున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

టేకులపల్లి,ఏప్రిల్ 6 (జనం సాక్షి ): ఇటీవల ఒక కాలు మోకాలు పై భాగం వరకు కోల్పోయిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన గ్యారే రామస్వామిని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. రామస్వామి కాలుకు గాయమై షుగర్ వ్యాధితో మూలాన ప్రాణాపాయ స్థితి ఏర్పడటంతో ఆరు నెలల క్రితం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. పేదరికంలో ఉన్న రామస్వామిని  ఎమ్మెల్యే పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. సదరం క్యాంపుకు తరలించి సర్టిఫికెట్ తీసుకోవాలని, అందుకు ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోతు సురేంద్ర నాయక్ కు  సహకరించాలని అన్నారు. సర్టిఫికెట్ రావడంతో వెంటనే తన పనులు తాను నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయడానికి బ్యాటరీ తో కూడిన వీల్ చైర్ ని అందిద్దామని అన్నారు.