Wednesday, 4 November 2026

తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు “తొగర్ల సురేష్ ” కు ఆహ్వానం

 

 

 

 

 

 

 

ముప్కాల్ (జనం సాక్షి) ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలల్లో పాల్గొనవలసిందిగా ముప్కాల్ చెందిన తొగర్ల సురేష్ కు ఆహ్వానం అందింది ఈనెల 9 10 తేదీన తిరుపతిలో మహతి ఆడిటోరియంలో సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి .గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదు కావాలని లక్ష్యంతో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తోగర్ల సురేష్ కు ఆహ్వానం అందడంతో ప్రముఖ కవులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్కాల్ పోలీస్ స్టేషన్లో ఇన్చార్జి ఎస్ఐ గా పనిచేస్తున్న తొగర్ల సురేష్ కవిగా సాహితీవేత్తగా జిల్లా ప్రజలకు సుపరిచితమే అనేక సామాజిక అంశాలపై కవితలను సంకలనం చేసిన ఆయన జిల్లాలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు ఇటీవల “ఇందూరు విశిష్ట” కవి అవార్డును కూడా పొందారు. సురేష్ మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇటువంటి బ్రహ్మోత్సవాలకు నన్ను ఆహ్వానించిన శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్ కు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు