వేమనపల్లి,ఏప్రిల్ 6,(జనంసాక్షి):నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మామడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చెన్నూరు రూలర్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 20మంది పోలీస్ సిబ్బందితో నాలుగు బృందాలుగా విడిపోయి 50 ఇళ్లలో సోదాలు నిర్వహించారు.కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి,వారిని పేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా వారి వేలిముద్రలు తీసుకొని గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.సరైన పత్రాలులేని వాహాలను సీజ్ చేశారు.ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ… ప్రజల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని,నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ప్రజల రక్షణ,ప్రజలకు భద్రత భావం,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి,ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారనే విషయం కూడా తెలుస్తుందని,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ కలిగి ఉండాలని అన్నారు.మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం అన్నారు.మహిళలతో,చిన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన,మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు,మహిళలు ఆపద సమయంలో,ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన,యువకులు గుంపులుగా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన,ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని,వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీలలో,గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని అన్నారు.భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎవరైనా దొంగతనాలు చేయడానికైనా, అమ్మాయిలను,మహిళలను వేధించాలన్న, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి భయపడతారని అన్నారు.ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని,ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని సీఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ వెంకట్,నీల్వాయి ఎస్ఎచ్ఓ నరేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




