హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): అంబర్‌పేట్‌లో టీఆర్‌ఎస్ ప్రచారం జోరుగా నడుస్తోంది. అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో మూడు వందల మందితో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ చేసిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మైనార్టీ ప్రజలు సీఎం కేసీఆర్ ను తమ పెద్ద కొడుకులా భావిస్తున్నామని ప్రజలు తెలిపారు. తమ ఓటు సీఎం కేసీఆర్ కే అని తేల్చి చెప్పారు. ఇక్కడ ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి చేసింది ఏవిూ లేదని వాపోయారు. కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కనిపిస్తుందని ప్రజలు స్పష్టం చేశారు.




