Wednesday, 4 November 2026

బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు లేరని ఎద్దేవా

 

 

 

 

 

 

– భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే పసల్ భీమా యోజన పథకం అమలు చేస్తాం – నేటి నుంచి 15 రోజులపాటు కార్నర్ శక్తి కేంద్రాల సమావేశాలు హుజూర నగర్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి): బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు లేరని బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి 15 రోజులపాటు శక్తి కేంద్రాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. 15 రోజుల్లో 460 మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ వైఫల్యాలు, అవినీతి పాలన గురించి తెలియజేస్తామన్నారు. ఈ శక్తి కేంద్రాల్లో ప్రతి కార్నర్ మీటింగ్స్ గ్రామ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ అన్ని మండలాల్లో , సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శక్తి కేంద్ర స్థాయి కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్భాటం చేయనవసరం లేదు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ప్రజలు గుమిగూడిన చోట బిజెపి పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తామన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, అవినీతి పాలన గురించి చెబుతామన్నారు. ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జీ 20 సదస్సుకు అధ్యక్షత పోషించారన్నారు. ప్రజాదారణ ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ అని తెలిపారు. 2023 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పాలన ఉండదన్నారు. బిజెపి పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, బిజెపి పార్టీకి 22 శాతం ఓట్ బ్యాంకింగ్ వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్, సూర్యాపేట నుంచి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తామన్నారు. పక్క దేశాల్లో పాకిస్తాన్, శ్రీలంక ఆర్థిక సంక్షోభం వచ్చి ఒక కేజీ టమాటా 200, పెట్రోల్ 250 నుండి 300, గోధుమపిండి దొరకక, నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశం స్థిరంగా ఉంది. బలంగా ఉంది. కరోనా 2020 జనవరి నుంచి మూడు సంవత్సరముల పైగా 80 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోడీ ఉచితంగా ప్రతి ఒక్కరికి 6 కేజీల ఉచిత బియ్యం అందజేస్తున్నారన్నారు. ఈ ఉచిత బియ్యానికి, గోధుమపిండికి 3 లక్షల 60 వేల కోట్లు బిజెపి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో తయారు చేసే వ్యాక్సిన్ 100 దేశాలకు సరిపడా సరఫరా చేసిందని ఈ ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్, మైనార్టీ సబ్ ప్లాన్ బడ్జెట్లో అందజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు బడ్జెట్లో 1 లక్ష 22 వేల కోట్లు మైనార్టీ అభివృద్ధి కోసం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్లో ప్రత్యేకంగా సుమారుగా 86 వేల కోట్ల రూపాయలు వివిధ రంగాలకు కేటాయించిందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలన్నీ, రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకం వద్దు అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1386 జబ్బులకు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందని చెప్పి, ఇప్పుడేమో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా చెక్కులు పంపిణీ చేయిస్తుందన్నారు. ప్రజలందరూ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు అంబల్ల నరేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి తోట శేషు, గుండెబోయిన వీరబాబు, జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు, కీత శీను, కొట్టబోయిన లింగరాజు, నర్సింగ్ అంజయ్య, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సోమరాజు, రంగ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.