కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై8(జనం సాక్షి): ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ ఇన్‌ ఎª`లో 92,700 క్యూసెక్కులు, ఔట్‌ ఎª`లో 92,720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 5.80 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజ్‌లోని 8 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ ఇన్‌ ఎª`లో 7,900 క్యూసెక్కులు, ఔట్‌ ఎª`లో 10,800గా ఉంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 6.01గా కొనసాగుతోంది.