జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి): ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యాటక బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ హైదరాబాద్‌లో జెండా ఊపి ఈ బస్సును ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దేశంలోనే తొలిసారి ప్రాజెక్టు సందర్శనకు ఏసీ బస్సు ఏర్పాటుచేసినట్టు ఆ శాఖ పేర్కొంది. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ ఉంటుందని, పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా ముందుగా టికెట్లు బుక్‌చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రంగనాయకుల సాగర్, సుందిళ్ల బ్యారేజ్, అన్నారం పంప్‌హౌస్‌లను సందర్శించవచ్చని, సందర్శకులకు పర్యాటక ¬టళ్లలో అల్పాహారం, భోజన వసతులు కల్పిస్తామని వివరించారు.




