కావేరికి ధైర్యం జెప్పిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మ్యాక్సీ క్యుర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కావేరి వద్దకు వెళ్లి పలకరించి ,ధైర్యం చెప్పి త్వరలోనే కోలుకొని ఇంటికి వెళ్తావని నీకు నేనున్నానని ఎటువంటి భయం అవసరం లేదని అన్ని విధాలుగా అదుకుంటాను అని కావేరి కి ధైర్యం జెప్పి..నుదుటి మీద చేయి వేసి ఆప్యాయంగా పలకరించి..ఓదార్చి..మానసిక ధైర్యాన్ని కల్పించారు.అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు.




