వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతగిరి కొండల మధ్యలో ఆగిపోయింది. ప్రయాణికులకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఇంజన్ హీట్ కావడంతో నీళ్లు పోసి, ప్రయాణికులను కిందకు దింపి, బస్సును కొండ పైకి ఎక్కించుకొని, మళ్ళీ దిగిన ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని వెళ్లారు. ఎలాంటి ఘటనలు ఎన్ని జరిగినా, కండిషన్ ఉన్న బస్సులను అనంతగిరి రూట్లో వేయాలని మూడు రోజుల క్రితం ఎస్పీ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ విషయం చర్చ జరిగినా కానీ ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు
వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు




