Wednesday, 4 November 2026

కాశయ్య మృతి బాధాకరం దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్

కాశయ్య మృతి బాధాకరం దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 29 జనం సాక్షి న్యూస్
కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన పంది కాశయ్య మృతి బాధాకరం అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం కాశయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశయ్య మృతి పార్టీకి లోటు అని ఆయన అన్నారు. ఆయన వెంట పీఏ పల్లి మండల ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్,వల్లపు రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, రావుల వెంకటయ్య యాదవ్, రావుల సత్యనారాయణ యాదవ్ ,వస్కుల కృష్ణయ్య, పేర్వాల వెంకటయ్య,విరస్వామి తదితరులు పాల్గొన్నారు.