Wednesday, 4 November 2026

జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతకుమారి.

-జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతకుమారి.
– విద్యా వైద్యానికి ప్రాధాన్యత.
– జడ్పీ చైర్ పర్సన్ బి. శాంత కుమారి.

నాగర్ కర్నూల్ జిల్లాప్రతినిధి,డిసెంబర్29(జనంసాక్షి):

జిల్లాలో విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తానని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బి.శాంత కుమారి అన్నారు.గురువారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో ఆమె జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు.పెద్దకొత్తపల్లి జెడ్పిటిసి గౌరమ్మ ప్రొసీడింగ్ ను అందజేశారు.
అనంతరం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
జడ్పీ చైర్ పర్సన్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య వసతులకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.జడ్పిటిసిలు కార్యాలయ సిబ్బంది ఎంపీడీవోలు ఆమెకు పుష్పగుచ్చాలతో అభినందించారు.
అనంతరం ఆమె జడ్పిటిసి లతో కలిసి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు.జిల్లా కలెక్టర్ ఆమెకి అభినందనలు తెలిపారు.జిల్లాలో విద్య వైద్యంపై కలెక్టర్ తో ఆమె చర్చించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు గౌరమ్మ, దయాకర్ రెడ్డి, శ్రీశైలం, ప్రతాపరెడ్డి, జడ్పీ సీఈవో ఉష, డిప్యూటీ సివో భాగ్యలక్ష్మి, కార్యాలయ పర్యవేక్షకులు యూసుఫ్, ఎంపీడీవోలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.