Monday, 2 November 2026

కిర్గిస్థాన్‌లోని చైనా ఎంబసీ వద్ద పేలుడు

బిష్కేక్‌: కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు ఎంబసీ గేట్‌ లోపలికి కారు వేగంగా దూసుకొచ్చినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మృతి చెందగా.. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *