Tuesday, 3 November 2026

కిష్టాపూర్ లో తాగునీటి కట కట. * ప్రశ్నిస్తే అధికారుల కస్సు బస్సు * సింగల్ ఫేస్ మోటరే దిక్కు

కిష్టాపూర్ లో తాగునీటి కట కట. * ప్రశ్నిస్తే అధికారుల కస్సు బస్సు * సింగల్ ఫేస్ మోటరే దిక్కు.
జనం సాక్షి/ కొల్చారం
మండలం కిష్టాపూర్ గ్రామంలోని పదవ వార్డు ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదన్నట్లుగా ప్రభుత్వం నీటి సమస్య తీర్చడానికి మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నల్ల నీటిని అందిస్తుంది. సంబంధిత అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వివరిస్తున్నారు. తన వార్డులో నీళ్లు రావడంలేదని సమస్యను వెలుగులోకి వచ్చిన ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిష్టాపూర్ గ్రామంలోని పదో వార్డు ఎస్సీ కాలనీలో పలుసార్లు మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన తర్వాత పరిష్కారం లభిస్తుంది. కాగా గత రెండు రోజులుగా నీళ్లు రాకపోవడంతో ఎస్సీ కాలనీలో ఉన్న ఒకే ఒక్క సింగిల్ ఫేస్ మోటార్ పై కాలనీవాసులు ఆధార పడాల్సి వస్తుంది. వృద్ధులు నీటిని మోసుకుని రావడం ఇబ్బందికరంగా ఉంది. దీంతో కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని వార్డు సభ్యురాలు వసంతరాన్ని భర్త ప్రవీణ్ కుమార్ మిషన్ భగీరథ ఏయికి ఫోన్ చేయగా అతనిపై కస్సు బస్సు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తమ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రవీణ్ కుమార్, మరియు కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు.