వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న అర్డిఓ, మున్సిపల్ చైర్మన్*. మెట్ పల్లి టౌన్, జనవరి 02, జనంసాక్షి ;
మెట్పల్లి పట్టణములో సోమవారం రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని
వెంకటేశ్వర ఆలయంలో ఆర్డిఓ వినోద్ కుమార్ దంపతులు మున్సిపల్ చైర్మన్ రానవేణి సుజాత సత్యనారాయణ దంపతులు ఉత్తర ద్వారం ద్వారా దర్శన చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం చేన్న కేశవ స్వామి కోదండ రామాలయం లో
ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు , వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మహాజన్ నరసింహులు దొంతుల రాజకుమార్ పలువురు పాల్గొన్నారు
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న అర్డిఓ, మున్సిపల్ చైర్మన్*




