కిష్టారంలో ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం
* ఏజెన్సీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం
* సర్పంచ్ జబ్బ విజయలక్ష్మి
టేకులపల్లి, నవంబర్ 24( జనం సాక్షి ): జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నీవిశేషంగా ప్రజలు ఉపయోగించుకోవడంతో విజయవంతమైంది. మారుమూల గ్రామాలలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని స్థానిక సర్పంచ్ జబ్బా విజయలక్ష్మి అన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు తరచుగా ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆమె కోరారు. కిష్టారం చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు ఈ శిబిరానికి విశేషంగా తరలివచ్చారు. గర్భిణీ స్త్రీలు 45 మంది, చిన్నపిల్లలు 20 మంది, చెవి, ముక్కు, గొంతు కి సంబంధించిన వారు 15 మంది, కంటి సమస్యల గురించి 22 మంది, ఎముకలు, కీళ్లు ఇతర సమస్యల గురించి 198 మంది, మొత్తం 297 మంది ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో చికిత్స పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జబ్భా విజయలక్ష్మి, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుకృత, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రసన్న, చెవి, ముక్కు, గొంతు డాక్టర్ శ్రీలత, సాధారణ చికిత్స కు డాక్టర్ బావ్ సింగ్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, సీడీపీఓ మంగతార, ఆప్తాలమిక్ ఆఫీసర్ బద్రు, సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ పాయం శ్రీను, ఆరోగ్య విస్తరణ అధికారి దుర్గారావు,క్షయ వ్యాధి సూపర్వైజర్లు సర్వన్,శంకర్, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, వీసం శకుంతల, అంగన్వాడి సూపర్వైజర్ లక్ష్మి, స్థానిక హెడ్మాస్టర్ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి శిరీష, ఏఎన్ఎంలు మానస, నాగలక్ష్మి, అరుణాదేవి,లక్ష్మీబాయి, ధనసరి రాంబాబు, అం�




