ధరణి వెబ్సైట్లో భూముల రికార్డుల సవరణ చేయాలని మెండోర మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా మరియు తాసిల్దార్ కు వినతి పత్రం
మెండోరా నవంబర్ 24 (జనం సాక్షి )మెండోర మండలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ వీరవత్రి అనిల్ ఆదేశాల ప్రకారము ధర్నా చేసి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ధరణి వెబ్సైట్ వలన భూమి హక్కు పత్రాలు కలిగి ఉండి భూమి అనుభవిస్తున్న వారి కష్టాలు మొదలైనవి ఐదు సంవత్సరాలు రైతుల యొక్క పత్రాలు ఇవ్వకపోవడం తన అవసరాలకు అమ్ముకుందామంటే అవకాశా లేకపోవడం జరిగింది రైతులు ఎన్నో సార్లు తాసిల్దార్ కు మరియు కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చిన నిషేధిత జాబితా నుండి ఇప్పటివరకు తొలగించకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు కౌలుదారులు దాదాపు 25 లక్షలు కౌలు రైతులు ఉన్నారు వారు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంటని జాబితా నుండి తొలగించి గ్రామ పంచాయతీ సభలో ఆయా గ్రామాల భూమి వివాదాలను వివాదాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం అటవీ భూములు 2006లో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం అందరికి భూమి హక్కు కల్పించాలి అని డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ రాజేందర్ రైతు విభాగం ఆరేపల్లి మురళి మెండోరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తింటి ముత్యం రెడ్డి మండల యూత్ నాయకులు బద్ది సాయికుమార్ గుండోజి రవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




