జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన మంథని మండలం కన్నాలకు చెందిన ముస్కుల సురేందర్ రెడ్డి కి కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి కి స్వీట్ తినిపించి శాలువా కప్పి సన్మానం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఐలి ప్రసాద్, బండారి ప్రసాద్, భూస తిరుపతి, బొజ్జ సతీష్ తదితరులు ఉన్నారు.




