Thursday, 5 November 2026

కిసాన్ గల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో వాటర్ ప్లాంట్ డొనేషన్

కిసాన్ గల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో వాటర్ ప్లాంట్ డొనేషన్…

భైంసా రూరల్ డిసెంబర్ 05 జనం సాక్షి

భైంసా పట్టణం కిసాన్ గల్లీ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం సెంట్రల్ టాక్స్ అండ్ జిఎస్టి మేడ్చల్ శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధత్రాగునీరు అందించాలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ డొనేట్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం ఏదో ఒక పాఠశాలకి శాఖ తరుపున ప్లాంట్స్ డొనేషన్లు చేయడం జరుగుతుందని, బాల బాలికలు విద్యను అభ్యసించాలంటే మొదట ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పివిబి చలం, టాక్స్ అసిస్టెంట్స్ నాము జాదవ్,చంద్రశేఖర్, కౌన్సిలర్ గాలి రవి, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు