రైతులకు భూసార పరిరక్షణ కోసం అవలంబిస్తున్న పద్ధతులపై అవగాహన
ఏడిఎ సంగీతలక్ష్మి
మల్దకల్ డిసెంబర్ 5 (జనంసాక్షి)మండలం లోని రైతులకు ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా సోమవారం జడ్పీ చైర్మన్ సరితా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల అవలంబిస్తున్న పద్దతుల వలన భూసారం క్షిణించిపోతుంది కావున రైతులకు భూసార పరిరక్షణ కోసం అవలంభించాల్సిన పద్దతులు ఎరువుల వాడకం , పచ్చిరొట్ట ఎరువుల సాగు పంట మార్పిడి,అంతర పంటలు,అవసరాన్ని బట్టి పురుగు,తెగుళ్ల మందులలని వాడటం,పంట అవశేషాల నిర్వహణ సరైన మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు గురించి సేంద్రియ ,జీవన ఎరువుల వాడకం వలన భూమి భౌతిక రసాయనిక స్వభావాలు మెరుగుపడతాయి.నెలలోని సారాన్ని పెంచి సూక్ష్మ పోషక లోపాలు నివారించబడి అన్ని పోషకాల మధ్య నేలలోని సమతుల్యత ఏర్పరచి ఉత్పాదకను పెంపొందిస్తాయి. నేల గుల్లబారి,నీటిని నిలుపుకునే శక్తి పెరిగి వేర్లకు నీరు,గాలి బాగా అందుతాయి నేలలోని సూక్ష్మ జీవుల త్వరితంగా వృద్ధి చెంది భూసారాన్ని పెంచుతాయి.ఎంపీపీ రాజారెడ్డి మాట్లాడుతూ జీవన ఎరువులు వాడటం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడమే కాక రసాయనిక ఎరువుల వాడకాన్ని 20-25 శాతం వరకు తాగించుకోవచ్చు అని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సహాయ వ్యవసాయ సంచాలకులు సంగీత లక్ష్మి , పిఎసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ రైతు మండల కో – ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కె.రాజశేఖర్,ఏఈఓ రాహులు పైలట్ మరియు రైతులు పాల్గొన్నారు.




