Thursday, 5 November 2026

పేదలకు భరోసా ఇస్తున్న డిఎన్అర్..

పేదలకు భరోసా ఇస్తున్న డిఎన్అర్..
– మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి.
ఊరుకొండ, డిసెంబర్ 5 (జనంసాక్షి):
బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు భరోసా నిస్తూ, ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,
మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని, ఆయన చేస్తున్న సేవలు వేల కట్టలేనివని రాచాలపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఊరుకొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన వడ్ల ఆంజనేయులు(40) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… 5వేల ఆర్ధిక సహాయం కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఎంతమంది నాయకులు ఉన్న తనదైన శైలిలో ప్రజలతో మమేకమై ఎక్కడ ఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసానిస్తున్న ఏకైక వ్యక్తి డిఎన్ఆర్ అని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్ రెడ్డి, మధు, రవి, హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.