. కుంగ్ పూ నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ గార్డెన్ లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ – పూ అకాడమీ అధ్వర్యంలో కుంగ్ – పూ నేర్చుకున్న విద్యార్థులకు కుంగ్ – పూ బెల్ట్ లు మరియు సర్టిఫికెట్స్ అందించారు తదనంతరం డి సి ఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ,కుంగ్ – పూ నేర్చుకోవడంతో ఆత్మరక్షణతోపాటు,ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని,ఆధునిక కాలంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు.కుంగ్ – పూ వల్ల ఆరోగ్యంతో పాటు,మహిళలకు ఆత్మరక్షణ కు దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులకు బెల్టులను అందజేశారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ సంగి సత్తేమ్మ, సంగి శేఖర్, డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమీ పౌండర్ రాజమల్లు, ప్రెసిడెంట్ రాజేందర్,జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్, ట్రెజరరీ నర్సింహ రావు,మాస్టర్లు ఆలీం,గణేష్,రవి,ముజాయిద్, వెంకట స్వామి,విద్యార్థుల తల్లదండ్రులు పాల్గొన్నారు.
కుంగ్ పూ నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.




