వీణవంక జనవరి 22 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని స్థానిక జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో క్రీడా మైదానంలో వాలీబాల్ క్రీడాకారులకు వీణవంక ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రెస్సుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఉత్సాహం చూపడం చాలా సంతోషకరమని, క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శరీరక దారుత్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా యువత ఆన్ లైన్ గేమ్స్ బారినపడి మోసపోతున్న కాలంలో ఇలాంటి క్రీడాలను ప్రోత్సహిస్తున్న స్థానిక పోలీసులకు యువతకు వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూసి పట్ల రేణుకా తిరుపతి రెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి వైస్ ఎంపీపీ లతా- , పిఎసిఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి జమ్మికుంట రూరల్ సీఐ సురేష్ స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి పోతుల నరసయ్య, మండల క్రీడాకారులు యువత మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




