కొత్తగూడ మే 19 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో పిచ్చి కుక్కలు విజృంభస్తున్నాయి.మహబూబాాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ప్రాంగణం కావడంతో మాంసం కోసం కుక్కలు అధిక సంఖ్యలో అక్కడే ఉంటున్నాయి.శుక్రవారం జాతర కావడంతో వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది.అమ్మవారిని కష్టాలు కోరికలు తీరాలని వేడుకోవడం జరుగుతుంది.కష్టాలు తీరాలని వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది.మొదట గుంజేడు ప్రాంగణంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిపై కుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో బట్టలు సైతం మొత్తం చినిగిపోవడంతో మతిస్థిమితం లేని వ్యక్తికి శ్రీకాంత్ అనే వ్యక్తి బట్టలు వేసి హాస్పటల్ కు అంబులెన్స్ ఫోన్ చేసి అతని చికిత్స కోసం పంపించడం జరిగింది.అదే పనిగా కుక్క వరుసగా సుమారుగా 19 మందికి పైగా దాడి చేయడం జరిగింది.ఇందులో 8 మంది కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయించుకొని చికిత్స చేయించుకోవడం జరిగింది.కుక్క కాటుకు బలైన మిగిలిన వ్యక్తులు చికిత్స కోసం గూడూర్,మహబూబాద్ జిల్లా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లిపోయారు.భయం భయంగా భక్తులు:జాతర కు వచ్చిన భక్తులకు ఎటు నుండి వచ్చి దాడి చేస్తుందని కర్రలతో కాపలా కాసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు.అయినా కుక్క సుమారుగా 20 మందిపై దాడి చేసింది.ఆలయం ప్రాంగణం నుండి భోజనాలు సైతం చేయకుండా నిరాశతో వారి గ్రామాలకు వెళ్లిపోయారు.భక్తులు మాట్లాడుతూ సుమారుగా 20 మంది పై కుక్క దాడి చేయడం జరిగింది.స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది గాని ఆలయ కమిటీ అధికారులు వచ్చి మమ్మల్ని పలకరించడం కూడా జరగలేదని భక్తులు బోరున విలపించారు.నెల్లికుదురు గ్రామానికి చెందిన భక్తులు కుటుంబంతో సహా జాతరకు రావడం జరిగింది.పిల్లలపై దాడి చేసే క్రమంలో తండ్రి వెళ్లడంతో తండ్రి పై విపరీతంగా దాడి చేసింది.తండ్రికి గాయాలు కావడంతో పిల్లలు బోరున వినిపిస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోదామని భయంతో పిల్లలు ఏడుస్తూ తండ్రికి గాయాన్ని శుభ్రం చేశారు.ఇలాంటివి పునరావతం కాకుండా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ ప్రాంగణంలో భక్తులను కుక్కల దాడి నుండి రక్షించాలని భక్తులు కోరడం జరిగింది.
కుక్కసైర విహారం…భయం భయంగా భక్తులు గుంజేడు జాతరలో 20 మంది పై దాడి




