గంగారం, మే 19, (జనంసాక్షి )
వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో గంగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్ఏల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గంగారం మండల వీఆర్ఏ ఈసం శ్రీనివాస్, దుర్గం ముత్తయ్య, దుర్గం సమ్మయ్య, జనగం పాపారావు మరియు మద్దెల సమ్మయ్య పాల్గొన్నారు
సీఎం కెసిఆర్ చిత్రపటానికి గంగారం వీఆర్ఏల పాలాభిషేకం.




